Tuesday, May 9, 2017

గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ...

గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ...

సరోజ టీచర్ ఆ రోజు ఐదవ తరగతి లోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని. 

అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు నచ్చలేదు . ఏడాదిగా అతడిని గమనిస్తోంది. అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో పాల్గొనడం లేదు , డ్రెస్ సరిగా వేసుకోవడం
లేదు. దీంతో ఆమెకు అతడంటే సదభిప్రాయం కలగలేదు .

కాలం గడిచిపోసాగింది . అతడి పేపర్స్ లో ఆమె ఎర్ర సిరా గుర్తులు పెరిగిపోసాగాయి.. మార్కులు తక్కువగా
పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 

పిల్లల గురించి టీచర్ సీసీఈ కుమ్యలేటివ్ రికార్డు రాయాలి . అందరి రికార్డులూ రాసేసినా ఎందుకో ఆమెకు మహేశ్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . 

వార్షిక పరిక్షలూ దగ్గర పడుతున్నాయి. మహేశ్ వివరాలు నమోదుచేయాలి. ఒక రోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది . పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది.
అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది.

 " మహేశ్ చాలా తెలివైన కుర్రాడు . అందరితో కలసి పోతాడు. అతడితో అందరూ చాలాస్నేహంగా ఉంటారు. ఇంటిపని నీట్ గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ "

రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ ఈమద్య అతడి తల్లికి వచ్చిన
జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు "

మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ది చాలా కష్టపడేతత్వం. చదువులో బాగానే ఉన్నాడు కానీ
అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు "

నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ చదువులో వెనుకబడి పోయాడు . అతను ఫ్రెండ్స్ తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు "

సరోజ టీచర్ కి సమస్య అర్ధ మైంది. ఇన్నాళ్ళూ తను మహేశ్ గురించి తెలుసుకోనందుకు బాధ పడింది .
అంతలోనే టీచర్స్ డే వచ్చింది. ఏర్పాట్లలో సరోజ తలమునకలైంది. మహేశ్ నీ సానుభూతితో
చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . 

టీచర్స్ డే రోజు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇస్తున్నారు . అందమైన రంగుకాగితాలతో చుట్టిన విలువైన కానుకలు ఇవ్వసాగారు . ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేశ్. ఆ బ్యాగ్ సగం చిరిగి ఉంది .  అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వతున్నారు . సరోజ వారిని కసిరి " చాలా బాగుంది " అని మహేశ్ తో అంది .

ఆమెకు దూరంగా నిల్చున్న మహేశ్ " మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు" అన్నాడు .
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా సరోజ టీచర్ మాత్రం క్లాసును వదల లేక పోయింది .
క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .

ఆ రోజు నుండి ఆమె మహేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . మహేశ్లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .

ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్ కి పోయాడు. ఇక్కడితో అయిపోలేదు . మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది. అందులో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం సారాంశం .

మరో నాలుగేళ్లకు వచ్చిన ఉత్తరంలో " నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాను . అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "

మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ ".

ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి ఉత్తరం లో చివరన సంతకం కింద మహేశ్, M.D. అని సంతకం చేశాడు .

ఇంతటితో ఈ కధ అయిపోలేదు .
ఇంకో ఉత్తరం వచ్చింది .

" నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే..నాన్న గారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరుండాలని నా కోరిక "

సరోజ పెళ్ళికి వెళ్ళేటపుడు మహేశ్ ఐదవ తరగతిలోబహూకరించిన నెక్లెస్ ధరించింది..

అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి .

ఆ పెళ్లి రోజు మహేశ్ కి వాళ్ళ అమ్మ కనిపించింది.

Tuesday, August 26, 2014

Life is creating yourself


జీవితం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం కాదు...
నిన్ను నువు మలచుకోవడం...




Life is not about finding yourself ... ...
... .... Life is about creating yourself







Do You Know How to Reach Your Hardest Goals in your Life

Remember that nothing is impossible, if you try your best


1
Write your goal down, and post it in a spot you will see several times a day.
Read your goal when you wake up, and before you go to sleep. This will motivate you to keep pursuing your goal every day and increase the chance of you achieving it by a 1000.



2
Get a daily planner. 
Write down small daily goals that will help you achieve your main goal.


3
Write down 50 things that will help you reach your goal. 
After you complete one, cross it off and write a new one.


4
Get help from the experience of others. 
Other people have had a goal that is the same or similar to yours. Draw on their experience by reading what they have written, taking a class that they are teaching, or talking with them personally.


5
Make it known to your family and friends what you are trying to accomplish.
This will give you a sense of needing to complete what you've started.


6
Create a schedule if you have a deadline. 
Make time for breaks, and remember to eat a good breakfast in the morning. You will get much more done if you start when you are feeling fresh and awake. Remember to get plenty of sleep.


7
Try to get some people to help you or who are interested in your cause. 
It has been proven that people who have group support are more likely to reach their goal, than people who go solo.


8
Keep a daily journal and write a paragraph or two every night talking about your goal (what you've done to get closer to accomplishing it) and what you can do.


9
Find inspirational quotes like, "Ask and you shall receive, seek and you shall find, knock and it will be opened."


10
Do not get discouraged. 
Put negative thoughts out of your mind as soon as you become aware of them. Change negative things like, "I can never do it," into, "How can I do it?"


11
Seek answers to your questions.



12
Work hard and don't give up. 
People accomplish amazing things when they kick the negative thinking habit.




ప్రయత్నం ..... ఉంటే ..... సాధ్యం ....


.....
ప్రయత్నం అన్నది ఉంటే 
సాధ్యం చేయ్యాలేనీది అనేది లేదు...
.....




image source: http://www.nathanialsmith.com/category/mlm-recruiting/